'కార్తికేయ 2' టీమ్ మళ్లీ మనసు మార్చుకుందా?

నిఖిల్ హీరోగా 'కార్తికేయ 2' రూపొందింది. అభిషేక్ అగర్వాల్ .. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. ద్వాపర యుగానికి సంబంధించిన ఒక రహస్యం చుట్టూ ఈ కథ తిరగనుంది. ఈ సినిమాను ఈ నెల 22వ తేదీన విడుదల చేయనున్నట్టుగా చాలాకాలం క్రితమే ప్రకటించారు.

అయితే ఈ సినిమా ఆ రోజున థియేటర్లకు రావడం లేదనీ .. ఆగస్టు ఫస్టువీక్ లో రిలీజ్ చేయవచ్చని కొన్ని రోజుల క్రితం నిఖిల్  ట్వీట్ చేశాడు. అయితే ఇప్పుడు మేకర్స్ మనసు మార్చుకున్నట్టుగా ఒకవార్త షికారు చేస్తోంది. ఈ సినిమాను ఈ నెల 29వ తేదీనే విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. 

త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాలభైరవ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. నిఖిల్ జోడీగా అనుపమ పరమేశ్వరన్ అలరించనున్నాయి సినిమాలో, అనుపమ్ ఖేర్ .. ఆదిత్య మీనన్ .. తులసి .. శ్రీనివాసరెడ్డి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమా ఎంతవరకూ అంచనాలను అందుకుంటుందో చూడాలి.


More Telugu News