నెయ్యితో ఎన్నో ప్రయోజనాలు.. కానీ, అందరికీ కాదు..!

14-07-2022 Thu 13:43 | Health
  • నెయ్యితో గుండె, కళ్లు, జ్ఞాపకశక్తికి మంచిది
  • శరీర ధర్మాన్ని బట్టి ఆహారం ఎంపిక ఉండాలి
  • కఫ దోషం ఉన్న వారు నెయ్యికి దూరంగా ఉండాలి
  • కాలేయ సమస్యలున్న వారు తీసుకోకూడదు
పూర్వ కాలంలో నెయ్యి వినియోగం ఎక్కువగా ఉండేది. అప్పట్లో ఈ వాణిజ్య నూనె పంటల సాగు పెద్దగా ఉండేది కాదు. ప్రతి ఇంటిలో పాడి ఆవులు, గేదెలు ఉండడంతో పుష్కలంగా నెయ్యి లభించేది. దాంతో వినియోగం కూడా ఎక్కువగా ఉండేది. మరి, గతంతో పోలిస్తే నేడు నెయ్యి వినియోగం తగ్గింది. కానీ, జీవనశైలి వ్యాధులు పెరిగిపోయాయి. కనుక నెయ్యితో ఆరోగ్యానికి నష్టం జరుగుతుందన్న అపోహలు ఉంటే తీసేయాలి. ఆయుర్వేదంలోనూ నెయ్యిని ఔషధంగా పేర్కొన్నారు. 

నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. ఖాళీ కడుపుతో నెయ్యిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థను శుభ్రం చేయడంతోపాటు మలబద్ధకాన్ని పోగొడుతుంది. వృద్ధాప్య ఛాయలను ముందుగా కనపడనీయకుండా నెయ్యి మేలు చేస్తుంది. కంటి ఆరోగ్యానికి కూడా మంచిదే. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. మరి నెయ్యితో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా అని ప్రతి ఒక్కరూ నెయ్యి తీసుకోవడం కుదరదని ఆయుర్వేద డాక్టర్ రేఖా రాధామణి తెలిపారు. 

శరీర ధర్మానికి అనుకూలమైన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మంచి జరుగుతుందని ఆమె చెప్పారు. ఆరోగ్యకరం అన్న ప్రతిదీ ప్రతి ఒక్కరికీ సరిపడదన్నారు. వ్యక్తి శరీర ధర్మాన్ని ఆయుర్వేదం వాత, పిత్త, కఫ దోషాలుగా వర్గీకరించింది. కనుక ఒకరికి ఆరోగ్యాన్నిచ్చేది, మరొకరికి విషంగా మారొచ్చని  రాధామణి చెప్పారు. 

నెయ్యి జీర్ణానికి మందమైనది. దీర్ఘకాలంగా, తీవ్రమైన అజీర్ణం, జీర్ణ సంబంధ సమస్యలు ఉన్న వారు, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ బాధితులు నెయ్యి తీసుకోకూడదు. నెయ్యితో కఫం పెరుగుతుంది. కనుక జ్వరం వచ్చిన సమయంలో నెయ్యి తీసుకోకూడదు. అలాగే, కఫ దోషం ఉన్న వారు కూడా తీసుకోకూడదు. గర్భం దాల్చిన వారు, అప్పటికే తగినంత బరువు ఉంటే కనుక నెయ్యిని తగ్గించుకోవాలి. లివర్ సిర్రోసిస్, హెపటైటిస్ తదితర కాలేయ సంబంధిత వ్యాధులు ఉన్నవారు నెయ్యికి దూరంగా ఉండాలి.
gheeAyurvedamhealth benefitsavoid

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more