భారీ వర్షాల కారణంగా తెలంగాణలో ఈ సెట్ పరీక్ష వాయిదా
- ఈ నెల 13న తెలంగాణ ఈ సెట్ పరీక్ష
- భారీ వర్షాలతో 13 వరకు విద్యాలయాలకు సెలవులు
- 14 నుంచి ఎంసెట్ పరీక్ష యథాతథమన్న లింబాద్రి
రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా విద్యా సంస్థలకు ఈ నెల 13 వరకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ నెల 13న జరగాల్సిన ఈ సెట్ పరీక్షను రద్దు చేసినట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది. ఈ పరీక్షను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామన్న విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని మండలి అధికారులు తెలిపారు.