అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం... ఈ నెల 14 వరకు తెలంగాణలో రెడ్ అలర్ట్

Red alert issued for Telangana
  • పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు
  • కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు
  • తాజా బులెటిన్ లో వెల్లడించిన హైదరాబాద్ కేంద్రం
తెలంగాణను భారీ వర్షాలు ఇప్పట్లో వీడేట్టులేవు. ఈ నెల 14 వరకు తెలంగాణలోని కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 

సిద్ధిపేట, కరీంనగర్, ములుగు, రాజన్న సిరిసిల్ల, జనగామ, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, కొత్తగూడెం, కామారెడ్డి, హనుమకొండ, మెదక్, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

నిర్మల్, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఓవైపు ఒడిశా పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడిందని, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది.
Go Back to Shorts
Telangana
Rains
Red Alert

More Telugu News