మువ్వ‌న్నెల రంగుల్లో జాలువారుతున్న జ‌లాలు!.. వీడియో ఇదిగో!

Visuals from Krishna Raja Sagar dam where water inflow was witnessed under the tricolour lighting
  • కృష్ణ రాజ సాగ‌ర్ డ్యాం వ‌ద్ద ప్ర‌త్యేక లైటింగ్ వ్య‌వ‌స్థ‌
  • భారీ వ‌ర్షాల‌తో నిండిన క‌ర్ణాట‌క ప్రాజెక్టు
  • అన్ని గేట్ల‌ను ఎత్తేసి కింద‌కు నీటి విడుద‌ల‌
భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప్రాజెక్టుల‌న్నీ జ‌లక‌ళను సంత‌రించుకున్నాయి. ఆయా ప్రాజెక్టుల‌న్నీ పూర్తి స్థాయిలో నిండిన నేప‌థ్యంలో అధికారులు జ‌లాల‌ను దిగువ ప్రాంతాల‌కు వ‌దులుతున్నారు. ఈ క్ర‌మంలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తగానే కింద‌కు దుమికే జ‌ల దృశ్యాలు క‌మ‌నీయంగా ఉంటాయి. ఈ త‌ర‌హా దృశ్యాల‌ను చూసేందుకు  ప్ర‌కృతి ప్రేమికులు ఆస‌క్తి చూపిస్తుంటారు. ఈ దృశ్యాలు మ‌రింత‌గా ఆక‌ట్టుకునేలా చేసింది క‌ర్ణాట‌క అధికార యంత్రాంగం. ప్రాజెక్టు నుంచి జాలువారే జ‌లాల‌కు భారత జాతీయ జెండా రంగుల‌ను అద్దింది. దీంతో ఆ జాలువారే జ‌ల దృశ్యాలు మ‌రింత అందంగా క‌నిపిస్తున్నాయి. 

ఇలా మువ్వ‌న్నెల జెండా రంగుల్లో జాలువారే జ‌ల దృశ్యాలు క‌ర్ణాట‌క‌లోని కృష్ణ రాజ సాగర డ్యాం వ‌ద్ద ఆదివారం రాత్రి క‌నిపించాయి. మండ్య జిల్లాలోని ఈ ప్రాజెక్టు భారీ వ‌ర్షాల కార‌ణంగా పూర్తి స్థాయి నీటి మ‌ట్టానికి చేరుకోగా... ప్రాజెక్టు అన్ని గేట్ల‌ను ఎత్తేసి జ‌లాల‌ను అధికారులు కింద‌కు వ‌దిలారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక లైటింగ్ సిస్ట‌మ్ కార‌ణంగా ప్రాజెక్టు గేట్ల నుంచి జాలువారుతున్న జ‌లాలు మూడు రంగుల్లో క‌నిపించాయి.
Go Back to Shorts
Karnataka
Krishna Raja Sagara Dam
Mandya District
Tricolour

More Telugu News