రామ్ కంటే ముందుగా ఈ కథ బన్నీ దగ్గరికి వెళ్లిందా?!
- రామ్ హీరోగా రూపొందిన 'ది వారియర్'
- ఈ కథను ముందుగా విన్నది బన్నీ అంటూ టాక్
- ఆయన బిజీగా ఉండటం వలన రామ్ దగ్గరికి వచ్చిందంటూ ప్రచారం
- తెలుగు .. తమిళ భాషల్లో ఈ నెల 14న రానున్న సినిమా
అయితే ఈ కథ ముందుగా బన్నీ దగ్గరికి వెళ్లిందనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఆ మధ్య బన్నీని లింగుసామి కలిసి కథా చర్చలు జరుపుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ కథ ఇదేననే ప్రచారం ఇప్పుడు జోరందుకుంది. అయితే అప్పటికే 'పుష్ప' కోసం సుకుమార్ ను బన్నీ లైన్లో పెట్టేయడం జరిగిపోయింది.
ఆ తరువాత ప్రాజెక్టు కోసం బోయపాటికి అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగిపోయింది. బోయపాటి తరువాత త్రివిక్రమ్ తో సినిమా ఉండనుంది. అందువలన ఇప్పట్లో కుదరదని బన్నీ చెప్పడం వల్లనే, ఆ కథ తీసుకుని రామ్ దగ్గరికి లింగుసామి వచ్చినట్టు చెబుతున్నారు. ఒక హీరో బిజీగా ఉండటం వలన ఆ కథలు వేరే హీరోలకు వెళ్లడం మామూలే. అయితే బన్నీ వదులుకున్న ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఎటువంటి ఫలితాన్ని రాబడుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.