వచ్చే మూడ్రోజులు హైదరాబాద్ లో భారీ వర్షాలు
- నిన్న రాత్రి హైదరాబాదులో భారీ వర్షం
- ఇవాళ రాత్రి కూడా కురిసే అవకాశం
- అప్రమత్తమైన జీహెచ్ఎంసీ
కాగా, ఇవాళ రాత్రి కూడా హైదరాబాదులో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొనడంతో, జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. గత రాత్రి కురిసిన భారీ వర్షంతో హైదరాబాదు నగరం అతలాకుతలమైంది. డ్రైనేజీలు, నాలాలు ఉప్పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లపై మ్యాన్ హోల్స్ పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.