భారత్ సరిహద్దుల్లోకి దూసుకొచ్చిన చైనా విమానం... అప్రమత్తమైన సైన్యం
- లడఖ్ వద్ద ఘటన
- విన్యాసాలు చేపట్టిన చైనా ఎయిర్ ఫోర్స్
- చైనా విమానాన్ని పసిగట్టిన భారత రాడార్
- కాసేపటికి వెళ్లిపోయిన విమానం
తాజాగా, సరిహద్దుల్లో చైనా విమానం ఒకటి దూసుకొచ్చింది. ఈ విమానం లడఖ్ వద్ద భారత సైనిక స్థావరాలకు అత్యంత చేరువలో ఎగిరింది. భారత వాయుసేన రాడార్ ఈ విమానాన్ని గుర్తించడంతో వెంటనే బలగాలు అప్రమత్తం అయ్యాయి. కాసేపటికి ఆ విమానం మళ్లీ చైనా గగనతలంలోకి వెళ్లిపోయింది.
తూర్పు లడఖ్ వద్ద సరిహద్దులకు సమీపంలోని తమ అధీనంలోని ప్రాంతాల్లో చైనా వాయుసేన విన్యాసాలు చేపట్టింది. ఇందులో పాల్గొన్న ఓ విమానమే భారత సరిహద్దులకు సమీపానికి వచ్చినట్టు వెల్లడైంది. ఈ ఘటనను భారత సైన్యం వెంటనే చైనా సైనికాధికారులకు తెలియజేసింది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని స్పష్టం చేసింది. జూన్ చివరి వారంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.