తెలంగాణలో మరోసారి 500కి పైన కరోనా రోజువారీ కేసులు
- తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
- గత 24 గంటల్లో 25,913 కరోనా పరీక్షలు
- 552 మందికి పాజిటివ్
- హైదరాబాదులో 316 కొత్త కేసులు
- ఇంకా 4,753 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటిదాకా 8,03,374 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 7,94,510 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,753 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.
