రోడ్డు ప్రమాద బాధితుడిని సకాలంలో ఆసుపత్రికి తరలించిన రాహుల్ గాంధీ... వీడియో ఇదిగో!
Add ap7am to your home Screen

రోడ్డు ప్రమాద బాధితుడిని సకాలంలో ఆసుపత్రికి తరలించిన రాహుల్ గాంధీ... వీడియో ఇదిగో!

Rahul Gandhi helps road accident victim
  • వయనాడ్ లో పర్యటించిన రాహుల్ గాంధీ
  • హోటల్ కు వెళ్లే దారిలో రోడ్డు ప్రమాదం
  • వ్యక్తిని ఢీకొట్టిన బైక్
  • తన కాన్వాయ్ లోని అంబులెన్స్ ను రప్పించిన రాహుల్
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిన్న తన నియోజకవర్గం వయనాడ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ రోడ్డు ప్రమాద బాధితుడిని సకాలంలో ఆదుకున్నారు. నియోజకవర్గంలో పర్యటన ముగించుకుని తాను బస చేసిన హోటల్ కు వెళుతుండగా, మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదం జరగడాన్ని రాహుల్ గాంధీ గమనించారు. ఓ వ్యక్తిని బైక్ ఢీకొట్టగా, ఆ వ్యక్తికి గాయాలయ్యాయి. 

వెంటనే తన వాహనం నుంచి దిగిన రాహుల్ గాంధీ బాధితుడి పరిస్థితిని అంచనా వేశారు. వెంటనే తన కాన్వాయ్ లో ఉన్న అంబులెన్స్ ను రప్పించి ఆ క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించేందుకు చొరవ తీసుకున్నారు. బాధితుడికి ప్రథమచికిత్స చేసిన అనంతరం ఆ అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. ఈ సందర్భంగా రాహుల్ మానవతా దృక్పథంపై నెటిజన్ల నుంచి అభినందల జల్లు కురుస్తోంది.
Rahul Gandhi
Road Accident
Ambulance
Wayanad
Kerala
Congress

More Telugu News