సినీ నటి మీనా భర్త మృతికి పావురాలే కారణమా?
- శ్వాసకోశ సమస్యలతో మృతి చెందిన మీనా భర్త
- పావురాల వ్యర్థాల నుంచి వచ్చే గాలి పీల్చడంతో ఊపిరితిత్తుల సమస్య
- కరోనా కూడా సోకడంతో తీవ్రతరమైన ఊపిరితిత్తుల సమస్య
మీనా వాళ్లు ఉంటున్న ప్రాంతంలో పావురాలు ఎక్కువగా ఉంటాయి. వాటి వ్యర్థాల నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల ఆయనకు ఊపిరితిత్తుల సమస్య ప్రారంభమయిందట. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఆయనకు కరోనా సోకడంతో ఊపిరితిత్తుల సమస్య మరింత ఎక్కువయింది. ఊపిరితిత్తుల మార్పిడి చేయించాలని వైద్యులు సూచించినప్పటికీ దాతలు దొరకలేదు. దీంతో చివరకు ఆయన మృతి చెందారు. 2009లో మీనా, విద్యాసాగర్ వివాహం చేసుకున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఈ దంపతులకు నైనిక అనే కుమార్తె ఉంది.