కేటీఆర్‌తో ఫాక్స్‌కాన్ బృందం భేటీ... పెట్టుబ‌డులతో రావాల‌న్న మంత్రి

Foxconn delegation meets ktr in hyderabad
  • హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ఫాక్స్‌కాన్ చైర్మ‌న్ యాంగ్ లియూ
  • ప్ర‌తినిధి బృందంతో క‌లిసి కేటీఆర్‌తో భేటీ
  • తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టే దిశ‌గా కేటీఆర్ చ‌ర్చ‌లు
తెలంగాణ ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో గురువారం తైవాన్‌కు చెందిన ఎల‌క్ట్రానిక్స్ దిగ్గ‌జం ఫాక్స్‌కాన్ చైర్మ‌న్ యాంగ్ లియూ భేటీ అయ్యారు. త‌న కంపెనీకి చెందిన ప్ర‌తినిధి బృందంతో క‌లిసి హైద‌రాబాద్ వ‌చ్చిన లియూ మంత్రి కేటీఆర్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు, డిజిట‌ల్ హెల్త్‌, ఎల‌క్ట్రానిక్స్‌, రోబోటిక్స్‌పై కీల‌క చ‌ర్చ జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టాలంటూ లియూను కేటీఆర్ కోరారు. తెలంగాణ‌లో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు ఉన్న అవ‌కాశాలు, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహ‌కాలు త‌దిత‌రాల‌ను కేటీఆర్ ఫాక్స్‌కాన్ బృందానికి వివ‌రించారు. ఈ విషయాల‌ను స్వ‌యంగా కేటీఆర్ త‌న ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్ల‌డించారు. అంతేకాకుండా తెలంగాణ‌లో ఫాక్స్‌కాన్ పెట్టుబ‌డికి హామీ ద‌క్కేసింద‌ని కూడా కేటీఆర్ వివ‌రించారు.
Go Back to Shorts
TRS
KTR
Hyderabad
Telangana
Foxconn

More Telugu News