Mahesh Babu: త్రివిక్రమ్ తో మహేశ్ చేయనున్న మూవీ పాన్ ఇండియానే!

Trivikram and Mahesh Babu movie update
షార్ట్స్‌లో చూడండి
'అరవింద సమేత' .. 'అల వైకుంఠపురములో' హిట్స్ తరువాత త్రివిక్రమ్, 'సరిలేరు నీకెవ్వరు' .. 'సర్కారువారి పాట' హిట్స్ తరువాత మహేశ్ బాబు కలిసి ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందనున్న మూడో సినిమా ఇది. హారిక - హాసిని వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 

మహేశ్ బాబు తన కెరియర్లో చేస్తున్న ఫస్టు పాన్ ఇండియా సినిమా ఇది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయాలనే ఆలోచన దిశగానే అన్ని పనులు జరుగుతున్నాయి. వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు.

ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే అలరించనుంది. త్రివిక్రమ్ తో ఆమెకి ఇది మూడో సినిమా కాగా, మహేశ్ తో రెండో సినిమా. ఈ సినిమాను 'సంక్రాంతి'కి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ముందుగా అనుకున్న ప్రణాళికలో ఏ మాత్రం మార్పు జరిగినా 'ఉగాది'కి విడుదల చేస్తారట. మహేశ్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు ఈ సినిమాపైనే దృష్టిపెట్టారు.
Go Back to Shorts
Mahesh Babu
Pooja Hegde
Trivikram Movie

More Telugu News