100 రోజుల మార్క్ దాటిన షర్మిల యాత్ర... భారీ జనసందోహాన్ని చూసి ఉప్పొంగిపోయిన వైఎస్సార్టీపీ అధినేత్రి
- తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న షర్మిల
- మంగళవారం 100 రోజుల మార్క్‌ను దాటిన పాదయాత్ర
- కోదాడలో భారీగా హాజరైన జనం
ఈ సందర్భంగా తన యాత్రకు భారీ జనసందోహం హాజరైన వైనాన్ని చూసి షర్మిల ఉప్పొంగిపోయారు. తనను చూసేందుకు వచ్చిన జనానికి అభివాదం చేస్తూ సాగిన ఆమె... జనంతో మమేకమయ్యారు. జనం మధ్యలోనే నడుస్తూ కొంత దూరం సాగారు. ఈ మేరకు పాదయాత్రకు హాజరైన భారీ జనసందోహాన్ని చూపుతూ ఫొటోలను షర్మిల తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.