లండన్ లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపిన తెలంగాణ మంత్రి తలసాని
- సికింద్రాబాద్ లో హింసాత్మక ఘటనలు
- అగ్గిరాజేసిన అగ్నిపథ్
- రాకేశ్ అనే యువకుడు పోలీసు కాల్పుల్లో మృతి
- స్పందించిన మంత్రి తలసాని
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగిన సంఘటన చాలా బాధాకరం అని పేర్కొన్నారు. ఈ ఘటనలో మరణించిన రాకేశ్ కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నానని వెల్లడించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం హింసావాదాన్ని ప్రోత్సహిస్తోందని తలసాని విమర్శించారు. ఈ సందర్భంగా లండన్ లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపినట్టు వెల్లడించారు. మోదీకి మంచి బుద్ధి కలగాలని గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి వేడుకున్నానని తెలిపారు.
.