తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పైపైకి!

Telangana corona cases update
  • గత కొన్నిరోజులుగా 200కి పైన కొత్త కేసులు
  • గత 24 గంటల్లో 28,424 కరోనా పరీక్షలు
  • 285 మందికి పాజిటివ్
  • హైదరాబాదులో 188 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 65 మంది
  • ఇంకా 1,621 మందికి చికిత్స
తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల పెరుగుదల కనిపిస్తోంది. గత కొన్నిరోజులుగా 200కి పైగా కొత్త కేసులు వెల్లడవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 28,424 కరోనా పరీక్షలు నిర్వహించగా, 285 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్క హైదరాబాదులోనే 188 కొత్త కేసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో 54, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 65 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనా మరణాలేవీ సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటిదాకా 7,95,293 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,89,561 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,621 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా వల్ల రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.
Go Back to Shorts
Telangana
Corona Virus
New Cases
Update

More Telugu News