Sonu Sood: జూబ్లీహిల్స్ పబ్ రేప్ కేసుపై సోనుసూద్ స్పందన

Sonu Sood response on Jubilee Hills pub rape case
షార్ట్స్‌లో చూడండి
ఎంతో మందికి ఎన్నో విధాలుగా సాయం చేసిన సినీ నటుడు సోనుసూద్ రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా ఎందరికో సాయాన్ని అందించి మన్ననలు పొందారు. తాజాగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్ రేప్ కేసుపై సోనూసూద్ స్పందించారు. 

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందనే విషయాన్ని న్యూస్ లో చూసి షాక్ కు గురయ్యానని సోనూసూద్ చెప్పారు. ఇది చాలా పెద్ద నేరమని అన్నారు. అత్యాచారానికి పాల్పడింది మేజర్లా లేక మైనర్లా అనేది ముఖ్యం కాదని... వారు ఎలాంటి నేరం చేశారనేదే ముఖ్యమని చెప్పారు. 

ఇలాంటి నేరాలకు పబ్ లు కారణమవుతున్నాయని అనడం సరైంది కాదని సోను అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళలు, మైనర్ బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. మనం ఆలోచించే విధానంలోనే మార్పు రావాలని అన్నారు. మహిళలు పొట్టి బట్టలు వేసుకున్నారని విమర్శిస్తున్నారని... మనం ఆలోచించే విధానం సరిగా లేనప్పుడు మనకు తప్పుడు ఆలోచనలే వస్తాయని చెప్పారు.
Go Back to Shorts
Sonu Sood
Tollywood
Bollywood
Jubilee Hills
Rape Case

More Telugu News