యూపీలో సామూహిక వివాహంలో ఒక్కటైన 12 వేల జంటలు.. వధువుల ఖాతాల్లో రూ. 35 వేల చొప్పున జమ
- రాష్ట్రంలోని 60 జిల్లాల్లో సామూహిక వివాహాలు
- వరకట్న దురాచారాన్ని రూపుమాపేందుకేనన్న మంత్రి
- ఈ నెల 17న రెండో విడత వివాహాలు
రెండో విడత సామూహిక వివాహాలు ఈ నెల 17న నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. లక్నోలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అసిం అరుణ్ మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు చేయూత ఇవ్వడంతోపాటు వరకట్న దురాచారానికి అడ్డుకట్ట వేసేందుకే ప్రభుత్వం ఈ సామూహిక వివాహ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.