Aishwarya Rai: రాజమౌళి చిత్రంలో నటించబోతున్న ఐశ్వర్యారాయ్?

Aishwarya Rai to act in Rajamouli next movie
షార్ట్స్‌లో చూడండి
కొన్ని వార్తలు విపరీతంగా వైరల్ అవుతుంటాయి. ఇందులో ఎంత నిజం ఉంది? ఇది వాస్తవమేనా? అనే విషయాలతో సంబంధం లేకుండా...  వీటిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటుంటుంది. ఇప్పుడు అలాంటిదే ఒక వార్త విపరీతంగా ప్రచారం అవుతోంది. దర్శక దిగ్గజం రాజమౌళి తదుపరి చిత్రంలో ఐశ్వర్యారాయ్ నటిస్తుందనేదే ఆ వార్త. రాజమౌళి నెక్స్ట్ మూవీలో ఐశ్వర్య లీడ్ రోల్ పోషిస్తుందని ఫిలింనగర్ టాక్. ఐశ్వర్యకు సంబంధించి మరో వార్త కూడా వైరల్ అవుతోంది. రజనీకాంత్, దిలీప్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న చిత్రంలో ఐశ్వర్య నటించబోతోందనేదే ఆ వార్త. 

రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేశ్ బాబుతో తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ థ్రిల్లర్ గా చిత్రం తెరకెక్కబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలోనే ఐశ్యర్య  నటించబోతోందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో నటించేందుకు మహేశ్ రెడీ అవుతున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రానికి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.
Go Back to Shorts
Aishwarya Rai
Mahesh Babu
Rajamouli
Tollywood

More Telugu News