ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ ఇంట్లో ఈడీ సోదాలు... భారీగా బంగారం, నగదు సీజ్
- మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టయిన సత్యేంద్ర జైన్
- ఇంటిలో 1.80 కిలోల బంగారం, రూ.2.82 కోట్ల నగదు గుర్తింపు
- సరైన వివరాలు చెప్పలేకపోవడంతో సీజ్ చేసిన ఈడీ
కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీతో మనీ ల్యాండరింగ్‌కు పాల్పడుతున్నారని చాన్నాళ్ల నుంచి సత్యేంద్ర జైన్‌పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇటీవలే కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు గత వారం ఆయనను అరెస్ట్ చేయగా, కోర్టు రిమాండ్‌కు పంపిన సంగతి విదితమే.