కోల్‌కతాలో పది నిమిషాల్లోనే మద్యం డోర్ డెలివరీ.. సేవలు ప్రారంభించిన హైదరాబాద్ స్టార్టప్
- ‘బూజీ’ పేరుతో సేవలు అందిస్తున్న ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్
- మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్న పలు సంస్థలు
- పది నిమిషాల్లోనే డెలివరీ చేసే సంస్థ తమదేనన్న ‘బూజీ’
హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ‘బూజీ’ బ్రాండ్ పేరుతో కోల్‌కతాలో ఈ సేవలు అందిస్తోంది. ఆన్‌లైన్ సేవలకు ఉన్న డిమాండును దృష్టిలో పెట్టుకుని ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. పశ్చిమ బెంగాల్ ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతులు తీసుకుని ఈ సేవలు ప్రారంభించింది. మద్యాన్ని ఆర్డరు చేసిన పది నిమిషాల్లోనే డెలివరీ చేస్తున్నామని, ఇలా చేస్తున్న తొలి సంస్థ తమదేనని కంపెనీ పేర్కొంది.