కేసీఆర్ సర్కారుకు కృతజ్ఞతలు చెప్పిన షూటర్ ఈషా సింగ్
- నిఖత్, ఈషాలకు రూ.2 కోట్ల చొప్పున ప్రకటించిన కేసీఆర్
- ఇంటి స్థలాన్ని కూడా కేటాయిస్తున్నట్లు ప్రకటన
- ఈ ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన ఈషా సింగ్
ఈ ప్రకటన వచ్చినంతనే ఈషా సింగ్ ఉబ్బితబ్బిబ్బు అయ్యింది. తనకు నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించిన తెలంగాణ సర్కారు, సీఎం కేసీఆర్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు బుధవారం రాత్రి ఆమె ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ పోస్ట్ చేసింది. తమకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన ట్వీట్‌ను ఆమె తన ట్వీట్‌కు జత చేసింది.