ముగిసిన కేటీఆర్ దావోస్ టూర్!... తెలంగాణకు వచ్చిన పెట్టుబడులెంతంటే..!
- ముగిసిన దావోస్ సదస్సు
- ఫలవంతమైందన్న కేటీఆర్
- తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడి
5 రోజుల పాటు కొనసాగిన దావోస్ సదస్సులో తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులను సాధించినట్టు కేటీఆర్ తెలిపారు. సదస్సులో 45 బిజినెస్ మీటింగ్‌లు. 4 రౌండ్ టేబుల్ సమావేశాలు, 4 ప్యానెల్ డిస్కషన్ల ద్వారా ఈ పెట్టుబడులను సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. మొత్తంగా దావోస్ ఫలవంతమైందని కేటీఆర్ తెలిపారు. దావోస్ పర్యటనతో పాటు అంతకుముందు ఆయన లండన్‌లో జరిపిన పర్యటనను కూడా యాడ్ చేసి తన టూర్‌ను 10 రోజుల ట్రిప్‌గా అభివర్ణించారు.