చరణ్ సినిమాకి శంకర్ ఖరారు చేసిన టైటిల్ ఇదేనా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చరణ్ సినిమాకి శంకర్ ఖరారు చేసిన టైటిల్ ఇదేనా?

Shanakar and Charan Movie Update
  • షూటింగు దశలో శంకర్ సినిమా
  • వచ్చేనెల మరో షెడ్యూల్ కి సన్నాహాలు 
  • ఐఏఎస్ పాత్రలో కనిపించనున్న చరణ్ 
  • పరిశీలనలో 'అధికారి' టైటిల్
చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా చకచకా షూటింగు జరుపుకుంటోంది. ఇటీవలే వైజాగ్ షెడ్యూల్ ను పూర్తి చేశారు. వచ్చేనెల 2వ వారం నుంచి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ను మొదలెట్టనున్నట్టు చెబుతున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సినిమా కోసం మూడు టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. వాటిలో 'అధికారి' అనే టైటిల్ ను ఖరారు చేయనున్నట్టు సమాచారం. చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు కనుక, 'అధికారి' టైటిల్ కరెక్టుగా సెట్ అవుతుందని అంటున్నారు. టైటిల్ పవర్ఫుల్ గా ఉండటంతో దాదాపు ఖాయమైనట్టే అని చెబుతున్నారు.  

ఈ సినిమాలో చరణ్ సరసన నాయికగా కియారా అద్వాని అలరించనుంది. ముఖ్యమైన పాత్రలలో శ్రీకాంత్ .. సునీల్ .. అంజలి కనిపించనున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఆయన పాటలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నట్టు చెబుతున్నారు. పాటల చిత్రీకరణ కోసం కూడా భారీ స్థాయిలో ఖర్చు చేయనున్నట్టు టాక్.  

Ramcharan
Kiara Adwani
Shankar Movie

More Telugu News