సరిహద్దులు దాటిన పాక్ జానపద గీతం.. భారత్‌లో వైరల్!
- 'చల్ రే చల్ రే వాల్' ఫోక్ సాంగ్ కు అద్భుత స్పందన
- లాహోర్ గాయకులు షాన్జీ సియాల్, మోహ్సిన్ లషారీ వెర్షన్‌కు లక్షల్లో వ్యూస్
- 'మొహ్రా' సినిమాలోని 'నా కజ్రే కీ ధార్' పాటతో పోలుస్తున్న నెటిజన్లు
- భారత గాయని, యూపీ పోలీసు అధికారి కూడా పాడటంతో మరింత పాపులర్
- ప్రాంతీయ సంగీతం సరిహద్దులు దాటడంలో సోషల్ మీడియా పాత్రకు నిదర్శనం
సంగీతానికి భాష, ప్రాంతం, దేశం వంటి హద్దులు లేవని మరోసారి నిరూపితమైంది. పాకిస్థాన్‌కు చెందిన ఒక పాత జానపద గీతం ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని భారత్‌లో ప్రభంజనం సృష్టిస్తోంది. "చల్ రే చల్ రే వాల్" (కొన్ని వెర్షన్లలో 'తెదియాన్ రీసాన్ కోన్ కరే'గా ప్రసిద్ధి) పేరుతో ఉన్న ఈ సరైకీ జానపద పాట, ఇరు దేశాల సంగీత ప్రియులను ఏకం చేస్తోంది.
పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన గాయకులు షాన్జీ సియాల్, మోహ్సిన్ లషారీ ఆలపించిన ఈ పాట అకౌస్టిక్ వెర్షన్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో లక్షలాది వ్యూస్ సాధించింది. ముఖ్యంగా భారత పంజాబ్‌కు చెందిన యువత ఈ పాటకు ఫిదా అవుతున్నారు. పాకిస్థాన్‌లోని దక్షిణ పంజాబ్‌లో మాట్లాడే సరైకీ భాషలోని ఈ పాట చాలామంది భారతీయులకు అర్థం కాకపోయినా, దానిలోని మధురమైన బాణీ, జానపద ఛాయలు అందరినీ కట్టిపడేస్తున్నాయి.
ఈ పాట విన్న చాలామంది భారతీయులు, 1994లో వచ్చిన బాలీవుడ్ చిత్రం 'మొహ్రా'లోని 'నా కజ్రే కీ ధార్' పాటను గుర్తుచేస్తోందని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ పాట ప్రజాదరణకు భారత కళాకారులు కూడా తమ వంతు తోడ్పాటు అందించారు. ప్రముఖ భారత పంజాబీ గాయని సునందా శర్మ తనదైన శైలిలో ఈ పాటను పాడి షేర్ చేయగా, ఉత్తరప్రదేశ్ పోలీసు శాఖలో సబ్-ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న నిశాంత్ మిశ్రా గిటార్ వాయిస్తూ పాడిన వీడియో కూడా వైరల్ అయింది.
వాస్తవానికి ఇది కొత్తగా పుట్టిన పాట కాదు. తరతరాలుగా అక్కడి జానపద కళాకారులు పాడుకుంటున్న పాట ఇది. గతంలో మహమ్మద్ హుస్సేన్ బండియాల్వీ, దివంగత షఫావుల్లా ఖాన్ రోఖ్రీ వంటి ఎందరో కళాకారులు ఈ గీతాన్ని ఆలపించారు. సోషల్ మీడియా వేదికగా ప్రాంతీయ సంగీతం ఎలా సరిహద్దులు చెరిపేసి కొత్త శ్రోతలను చేరుకుంటుందో చెప్పడానికి ఈ పాటే తాజా నిదర్శనంగా నిలుస్తోంది.