పిక్ ఆఫ్ ద డే!.. కొడుకు గ్రాడ్యుయేషన్ సెర్మనీలో రేణు దేశాయ్‌తో పవన్ కల్యాణ్!
- ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న అకీరా
- సోమవారం స్కూల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న నందన్
- కార్యక్రమానికి హాజరైన పవన్ కల్యాణ్
- ఇద్దరు పిల్లలు, రేణుదేశాయ్ తో కలిసి ఫొటో
ఈ క్రమంలో ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న అకీరా నందన్ సోమవారం తన స్కూల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. ఈ కార్యక్రమానికి రేణు దేశాయ్ తన కూతురుతో కలిసి రాగా... పవన్ కల్యాణ్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అకీరా నందన్‌తో కలిసి పవన్, రేణు దేశాయ్, వారి కూతురు కలిసి ఓ ఫొటో దిగారు. సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఫొటో నిమిషాల వ్యవధిలోనే వైరల్‌గా మారిపోయింది.