Janasena: రుద్ర‌వీణ చిత్రంలోని ఈ పాట‌లోని పంక్తులు న‌న్నెంతో ప్ర‌భావితం చేశాయి: ప‌వన్ క‌ల్యాణ్‌

pawan kalyan remembers his brother chiranjeevi cinema rudraveena
షార్ట్స్‌లో చూడండి
మెగాస్టార్ చిరంజీవి సినీ ప్ర‌స్థానంలో రుద్ర‌వీణ చిత్రం ఓ ప్ర‌త్యేక చిత్రంగానే నిలుస్తుంది. 1988లో దిగ్గజ ద‌ర్శ‌కుడు కె.బాల‌చంద‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో చిరంజీవి న‌టన అద్భుత‌మ‌నే చెప్పాలి. ఇక సినిమాలోని మాట‌లు గానీ, పాట‌లు గానీ ప్రేక్ష‌కుడిని ఇట్టే ఆక‌ట్టుకున్నాయి. నాటి ఆ సినిమాను ప్ర‌స్తావిస్తూ చిరంజీవి సోద‌రుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సోమ‌వారం ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. 

రుద్ర‌వీణ సినిమాలోని 'చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా' పాటలోని పంక్తులు త‌న‌నెoతో ప్రభావితం చేశాయని ఆయ‌న‌ పేర్కొన్నారు. 'నువ్వుతినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది.. గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలిచింది.. ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా.. తెప్ప తగల బెట్టేస్తావా ఏరు దాటగానే? అన్న పంక్తులు తనను అమితంగా ప్రభావితం చేశాయని ఆయ‌న వెల్ల‌డించారు.
Go Back to Shorts
Janasena
Pawan Kalyan
Chiranjeevi
Tollywood

More Telugu News