దసరా రేసులో నిఖిల్ .. 'స్పై'
- వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నిఖిల్
- రిలీజ్ కి రెడీగా ఉన్న '18 పేజెస్' .. 'కార్తికేయ 2'
- యాక్షన్ థ్రిల్లర్ గా సెట్స్ పై ఉన్న 'స్పై'
- దసరాకి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న టీమ్
ఈ సినిమాలు విడుదలకు రెడీ అవుతూ ఉండగానే ఆయన మరో సినిమాను సెట్స్ పైకి తీసుకుని వెళ్లాడు .. ఆ సినిమా పేరే 'స్పై'. ఈడీ ఎంటర్టైన్ మెంట్ సంస్థ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్నాడు. చకచకా ఈ సినిమా షూటింగును జరుపుకుంటోంది. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.
ఈ సినిమాకి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ విటేకర్ పనిచేస్తుండటం విశేషం. ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దసరాకి ఈ సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. నిఖిల్ కెరియర్లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా కావడం విశేషం.