తెలంగాణ సీఎం కేసీఆర్‌తో త‌మిళ హీరో విజ‌య్ భేటీ

tamil Hero vijay meets telangana cm kcr
  • హైద‌రాబాద్‌లో హీరో విజ‌య్‌
  • ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో కేసీఆర్‌ను క‌లిసిన హీరో
  • విజ‌య్‌ని ఘ‌నంగా స‌న్మానించిన కేసీఆర్‌
తెలంగాణ సీఎం కేసీఆర్‌తో త‌మిళ స్టార్ హీరో విజ‌య్ భేటీ అయ్యారు. బుధ‌వారం హైద‌రాబాద్ వ‌చ్చిన విజ‌య్ నేరుగా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్లి కేసీఆర్‌ను క‌లిశారు. విజ‌య్‌ను సాద‌రంగా ఆహ్వానించిన కేసీఆర్ ఆయ‌న‌ను ఘ‌నంగా స‌న్మానించారు. 

అయితే ఈ భేటీ ఏ అంశం ప్రాతిపదిక‌గా జరిగింద‌న్న విష‌యం మాత్రం తెలియ‌రాలేదు. ఏదేనీ ప్ర‌త్యేక అంశంపై చ‌ర్చించేందుకే విజయ్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్లారా? లేదంటే హైద‌రాబాద్ వ‌చ్చిన నేప‌థ్యంలో కేసీఆర్‌ను మ‌ర్యాదపూర్వ‌కంగానే కలిశారా? అన్న దానిపై స్ప‌ష్ట‌త లేదు.

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వ‌చ్చిన విజ‌య్‌కు టీఆర్ఎస్ ఎంపీ జోగినప‌ల్లి సంతోష్ కుమార్ ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. విజ‌య్ వెంట ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి కూడా వ‌చ్చారు.  
Go Back to Shorts
KCR
TRS
Pragathi Bhavan
Hero Vijay
Kollywood

More Telugu News