సంక్రాంతి బరిలోకి దిగే దిశగా ఎన్టీఆర్ సినిమా!
- కొరటాల సినిమా కోసం రెడీ అవుతున్న ఎన్టీఆర్
- ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు
- ఆ రోజున కొరటాల సినిమా లాంచ్
- జూన్ .. జులై నెలల్లో రెగ్యులర్ షూటింగ్
- లైన్లో ప్రశాంత్ నీల్ .. బుచ్చిబాబు
ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఆ రోజున కొరటాల సినిమాను లాంచ్ చేయనున్నారు. జూన్ నుంచిగానీ .. జులై నుంచిగాని ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను థియేటర్స్ కి తీసుకుని రావాలనే ఉద్దేశంతో ఉన్నారట. ఆ దిశగానే అన్నీ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.
ఇది కొరటాల మార్క్ సినిమాగానే సున్నితంగా సందేశాన్ని ఇచ్చేదిగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమా తరువాత బుచ్చిబాబు .. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోను ఎన్టీఆర్ సినిమాలు చేయనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతూనే ఉన్నాయని సమాచారం.