'మ మ మహేశా' సాంగ్ కి రెస్పాన్స్ మామూలుగా లేదు!
- రిలీజ్ కి రెడీ అవుతున్న 'సర్కారువారి పాట'
- తమన్ స్వరపరిచిన పాటలకు మంచి మార్కులు
- 'మ మ మహేశా'కి 20 మిలియన్ ప్లస్ వ్యూస్
- ఈ నెల 12వ తేదీన సినిమా విడుదల
ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇంతవరకూ వదిలిన టైటిల్ సాంగ్ .. 'కళావతి' సాంగ్ .. ' పెన్నీ' సాంగ్ ఒక రేంజ్ లో జనంలోకి వెళ్లాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి 'మ మ మహేశా' సాంగును రిలీజ్ చేయగా ఒక కొత్త రికార్డులను నమోదు చేసే దిశగా దూసుకుపోతోంది.
రెండు రోజుల్లోనే ఈ పాట 20 మిలియన్ ప్లస్ వ్యూస్ ను రాబట్టడం విశేషం. ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో .. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాటను కలర్ఫుల్ గా చిత్రీకరించారు. ఈ పాటకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే, పాటల పరంగా ఈ సినిమా సూపర్ హిట్ అనిపించుకున్నట్టే అనుకోవాలి.