ఇంగ్లండ్‌ను కిందకు నెట్టేసిన టీమిండియా.. టీ20ల్లో టాప్ ప్లేస్‌లో రోహిత్ సేన
- 2021-22 ను టాప్ ప్లేస్‌తో ముగించిన టీమిండియా
- ఆ తర్వాత మొదటి స్థానాన్ని చేజిక్కించుకున్న ఇంగ్లండ్
- రోహిత్ కెప్టెన్సీలో వరుసగా సిరీస్‌ల కైవసం
- 270 పాయింట్లతో తిరిగి టాప్ ప్లేస్‌కు చేరిన భారత జట్టు
మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలో టీ20 సిరీస్‌లలో సత్తా చాటిన టీమిండియా 2021-22 ఏడాదిని టాప్ ప్లేస్‌తోనే ముగించింది. అయితే ఆ తర్వాత మంచి ఫామ్‌ను కనబరచిన ఇంగ్లండ్ ఇటీవలే టీమిండియాను రెండో స్థానంలోకి నెట్టేసింది. తాజాగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో తిరిగి సత్తా చాటిన టీమిండియా వరుసబెట్టి పొట్టి ఫార్మాట్ సిరీస్‌లను గెలుచుకుంది. ఫలితంగా 270 పాయింట్లతో తిరిగి టీమిండియా టాప్ ప్లేస్‌కు చేరుకుంది. 265 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో ర్యాంకులో కొనసాగుతోంది.