ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరిన ఏపీ సీఎం జ‌గ‌న్‌

ap cm ys jagan starts for delhi
  • గ‌న్న‌వ‌రం నుంచి ప్ర‌త్యేక విమానంలో బ‌య‌లుదేరిన జ‌గ‌న్‌
  • రెండు రోజులు ఢిల్లీలోనే ఉండ‌నున్న ఏపీ సీఎం
  • హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తులు, సీఎంల స‌మావేశానికి హాజ‌రు
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు శుక్ర‌వారం సాయంత్రం బ‌య‌లుదేరారు. తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జ‌గ‌న్ ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీ బ‌య‌లుదేరారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జ‌గ‌న్ రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండ‌నున్నారు. 

కోర్టులు-మౌలిక స‌దుపాయాల పేరిట శ‌నివారం ముఖ్య‌మంత్రులు ఆయా రాష్ట్రాల హైకోర్టుల ప్ర‌ధాన న్యాయ‌మూర్తుల‌తో సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఆధ్వ‌ర్యంలో జ‌ర‌గ‌నున్న స‌మావేశానికి జ‌గ‌న్ హాజ‌రుకానున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
AP CM
YSRCP
YS Jagan
Delhi Tour

More Telugu News