సారీ చెప్పిన మహేందర్ రెడ్డికి షాకిచ్చిన పోలీసులు
- తాండూరు సీఐపై మహేందర్ రెడ్డి బూతుల పర్వం
- పోలీసులకు సారీ చెప్పిన మహేందర్ రెడ్డి
- అయినా ఆయనకు పైలట్ వాహనాన్ని రద్దు చేసిన పోలీసులు
ఈ ఘటనపై టీఆర్ఎస్ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో సీఐపై తాను చేసిన వ్యాఖ్యలకు మహేందర్ రెడ్డి గురువారం సాయంత్రం సారీ చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే, మహేందర్ రెడ్డి సారీ చెప్పినప్పటికీ... పోలీసులు మాత్రం ఆయనకు కేటాయించిన పోలీస్ పైలట్ వాహనాన్ని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.