150 మిలియన్ వ్యూస్ తో 'కళావతి' సాంగ్!
- వినోదమే ప్రధానంగా 'సర్కారివారి పాట'
- బ్యాంకు స్కామ్ చుట్టూ తిరిగే కథ
- మహేశ్ సరసన కీర్తి సురేశ్
- మే 12వ తేదీన విడుదల
అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను, సిద్ శ్రీరామ్ ఆలపించాడు. తాజాగా ఆ పాట 150 మిలియన్ ప్లస్ వ్యూస్ ను రాబట్టుకుని అరుదైన రికార్డును నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని అందించిన ఈ పాట ఇంకా అదే స్పీడ్ తో దూసుకునిపోతోంది.
మహేశ్ బాబు సరసన కీర్తి సురేశ్ కథానాయికగా అలరించింది. బ్యాంకు స్కామ్ చుట్టూ తిరిగే ఈ సినిమాకి భారీ యాక్షన్ తో పాటు కావాల్సినంత కామెడీ ఉండనుంది. సముద్రఖని .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను మే 12వ తేదీన విడుదల చేయనున్నారు.