Waitress: రెస్టారెంటులో తనపై దాడి చేసిన కస్టమర్లకు కిక్కు దెబ్బలు రుచి చూపించిన లేడీ బ్రూస్ లీ... వీడియో ఇదిగో!

Waitress counter attack on raged customers
షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం కాలంలో మహిళలకు ఆత్మరక్షణ పోరాట విద్యలు ఎంతో అవసరమని సామాజికవేత్తలు చెబుతుంటారు. ఆ అవసరం ఏంటో ఈ వీడియో చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఓ రెస్టారెంటులో పనిచేస్తున్న మహిళపై కస్టమర్లు దాడి చేయగా, ఆమె బెదిరిపోకుండా వారికి తన మార్షల్ ఆర్ట్స్ ప్రావీణ్యాన్ని రుచి చూపించిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇద్దరు కస్టమర్లలో మొదట ఓ వ్యక్తి ఆ వెయిట్రెస్ పై దాడి చేయగా, ఆమె అతడిని పంచ్ లు, లెగ్ కిక్ తో పడగొట్టింది. ఆపై మరో వ్యక్తి కూడా దూసుకురావడంతో అతడిని కూడా ఆమె సమర్థంగా ఎదుర్కొంది. అతడు ఓ కుర్చీ తీసుకుని ఆమెపైకి విసరగా, స్ట్రెయిట్ కిక్ తో బలంగా తన్నేసరికి అతడి పారిపోయాడు. కిందపడ్డ మరో వ్యక్తి తీవ్రమైన బాధతో దొర్లుతూ ఉండడం వీడియోలో కనిపించింది. ఏమైనా ఆ మగువ ధైర్యానికి నెటిజన్లు నీరాజనాలు అర్పిస్తున్నారు. లేడీ బ్రూస్ లీ అంటూ ప్రశంసిస్తున్నారు.
Go Back to Shorts
Waitress
Counter Attack
Customers
Video

More Telugu News