విజయ్ కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ.. కాంగ్రెస్ కు 2, వామపక్షాలకు 2 మంత్రిపదవులు?

Vijay to Form Coalition Government in Tamil Nadu
  • తమిళనాడులో చరిత్ర సృష్టించిన విజయ్.. తొలి సంకీర్ణ ప్రభుత్వం
  • అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినా మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా నిలిచిన టీవీకే
  • కాంగ్రెస్, వీసీకే, వామపక్షాల మద్దతుతో కొలువుదీరనున్న సర్కార్
  • ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నటుడు విజయ్!
తమిళనాడు రాజకీయాల్లో నూతన అధ్యాయం ప్రారంభమైంది. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరనుంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ, మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టనున్నారు.

పొత్తు ధర్మంలో భాగంగా, ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిచ్చిన పార్టీలకు కేబినెట్‌లో కీలక పదవులు కేటాయించనున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ మేరకు విజయ్ తన ప్రతిపాదనను మిత్రపక్షాల ముందు ఉంచారు. కాంగ్రెస్ పార్టీకి రెండు, విడుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే)కు ఒకటి, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెరొక మంత్రి పదవి ఇవ్వాలని విజయ్ భావిస్తున్నట్టు సమాచారం. 

తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలకు గాను, ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, పార్టీ అధినేత విజయ్ రెండు నియోజకవర్గాల నుంచి గెలవడంతో పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యాబలం 107గా ఉంది. ఈ క్రమంలో, కాంగ్రెస్ (5), వీసీకే (2), సీపీఐ (2), సీపీఎం (2) పార్టీలు టీవీకేకు మద్దతు ప్రకటించడంతో సంకీర్ణ కూటమి బలం మ్యాజిక్ ఫిగర్ అయిన 118కి చేరింది.


Go Back to Shorts
Vijay
Tamil Nadu Politics
Tamilaga Vettri Kazhagam
TVK Party
Congress Party
Left Parties
Coalition Government
Tamil Nadu Assembly Elections
Tamil Politics

More Telugu News