పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్
- పశ్చిమ గోదావరి జిల్లాలో నిన్న పవన్ పర్యటన
- కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం
- వైసీపీ సర్కారుపై పవన్ విమర్శలు
- మండిపడిన అమర్నాథ్
- చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ వ్యాఖ్యలు
బహుభార్యలతో విలువలు లేని వ్యక్తి పవన్ అని ఆయన రెండో భార్య రేణు దేశాయ్ చెప్పారని గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ భార్యలు ఉన్న వ్యక్తి పవన్ అని, అలాంటి వ్యక్తి సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్నాడని విమర్శించారు. రుణమాఫీపై రైతులను మోసం చేసిన చంద్రబాబును నాడు పవన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. చంద్రబాబు దత్తపుత్రుడు అని చెప్పడానికి ఈ నిదర్శనం చాలదా? అని అన్నారు.