Pawan Kalyan: వేలేరులో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఘ‌న స్వాగ‌తం.. వీడియో ఇదిగో

pawan reachec veleru
షార్ట్స్‌లో చూడండి
జనసేన అధ్యక్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని కృష్ణా జిల్లా వేలేరు అడ్డరోడ్డు బైపాస్ మీదుగా వెళ్లారు. ఈ క్రమంలో వేలేరు వద్ద పవన్ కల్యాణ్ కు పూలతో జ‌న‌సైనికులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన ఏలూరుకు వెళ్లారు. ఏలూరులోని క‌ల‌ప‌ర్రు వ‌ద్ద‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, అభిమానులు స్వాగ‌తం ప‌లికారు. 

కాసేప‌ట్లో ఆయ‌న పెద‌వేగి మండ‌లం విజ‌య‌రాయి గ్రామానికి వెళ్ల‌నున్నారు. అక్క‌డ ర‌చ్చ‌బండ యాత్ర‌ను ప్రారంభిస్తారు. అలాగే, ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతుల కుటుంబాల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించి రూ.లక్ష చొప్పున‌ ఆర్థిక సాయం అందిస్తారు. ఇప్ప‌టికే ఏపీలోని ప‌లు బాధిత‌ రైతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ వారికి ఆర్థిక సాయం అందించిన విష‌యం తెలిసిందే.
Go Back to Shorts
Pawan Kalyan
Janasena
Andhra Pradesh

More Telugu News