Suriya: సినిమా సెట్టింగ్ కోసం కట్టిన ఇళ్లను పేదలకు ఇచ్చేస్తున్న తమిళ హీరో సూర్య

Tamil Hero Suriya humanitarian gesture towards poor fishermen
షార్ట్స్‌లో చూడండి
సినిమాల కోసం సెట్టింగులు వేయడం సాధారణమైన విషయం. అయితే, ఒరిజినాలిటీ కోసం అత్యధికంగా ఖర్చు చేస్తున్న నేటి తరం ఫిలింమేకర్లు... అసలు నిర్మాణాలను తలపించేలా సెట్టింగులు రూపొందిస్తున్నారు. షూటింగ్ పూర్తయ్యాక ఆ సెట్టింగులను కూల్చివేస్తుంటారు. తమిళ హీరో సూర్య, దర్శకుడు బాలా కాంబినేషన్లో వస్తున్న చిత్రం కోసం ఈ విధంగానే కన్యాకుమారిలో భారీ ఎత్తున మత్స్యకారుల వాడను నిర్మించారు. 

అయితే, సామాజిక స్పృహ మెండుగా ఉన్న హీరో సూర్య కీలక నిర్ణయం తీసుకున్నారు. కన్యాకుమారిలో షూటింగ్ పూర్తయ్యాక సెట్టింగులోని ఇళ్లను కూల్చివేయకుండా, అక్కడి పేద జాలర్లకు వాటిని ఇచ్చేయాలని నిశ్చయించుకున్నారు. సొంత ఇళ్లు లేని మత్స్యకారులను గుర్తించి వారికి ఆ ఇళ్లను పంపిణీ చేసేలా సూర్య చర్యలు తీసుకున్నారు. 

సూర్య నిర్ణయం పట్ల సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సూర్య నిజంగా హీరో అని, ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడుతున్నారు. సూర్య తన అగరం ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే ఎంతోమందికి సాయం చేశారు. పేద విద్యార్థులకు, వృత్తి పనివాళ్లకు ఆయన చేయూతనందించారు.
Go Back to Shorts
Suriya
Houses
Setting
New Movie
Bala

More Telugu News