YS Jagan: ఒంటిమిట్ట రాములోరి కల్యాణానికి సీఎం జ‌గ‌న్‌కు ఆహ్వానం

otimitta temples invitation to ap cm jagan
షార్ట్స్‌లో చూడండి
శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా క‌డ‌ప జిల్లా ఒంటిమిట్టలో జ‌ర‌గ‌నున్న శ్రీసీతారాముల క‌ల్యాణోత్స‌వానికి హాజ‌రు కావా‌లంటూ ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి శుక్ర‌వారం ఆహ్వానం అందింది. ఈ మేర‌కు తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యానికి వ‌చ్చిన టీటీడీ ఈవో జ‌వ‌హ‌ర్ రెడ్డి, ఒంటిమిట్ట రామాల‌యం ఈవో ర‌మ‌ణ ప్ర‌సాద్‌ కలిసి సీఎం జ‌గ‌న్‌కు ఆహ్వాన శుభ ప‌త్రిక‌ను అంద‌జేశారు.

తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత తెలంగాణ‌లోని భ‌ద్రాద్రిలో జ‌రిగే రాములోరి క‌ల్యాణానికి తెలంగాణ సీఎం హాజ‌రవుతుండ‌గా... ఏపీలో మాత్రం శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను క‌డ‌ప జిల్లాలోని ఒంటిమిట్ట రామాల‌యంలో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.
Go Back to Shorts
YS Jagan
Sri Rama Navami
Ontimitta

More Telugu News