పాకిస్థాన్ నిఘా సంస్థ కుట్రను భగ్నం చేసిన అమెరికా
- అమెరికా నిఘా వ్యవస్థల్లోకి చొరబడే యత్నం
- అమెరికా సిబ్బందికి ఖరీదైన కానుకలు
- ఇద్దరిని అరెస్ట్ చేసిన ఎఫ్ బీఐ
- పాకిస్థాన్, ఇరాన్ వీసాలు స్వాధీనం
- వారిద్దరూ ఐఎస్ఐ ఆదేశాలతో పనిచేస్తున్నట్టు వెల్లడి
అమెరికా అధ్యక్షుడి సీక్రెట్ సర్వీస్ సిబ్బందిని వారు ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నించినట్టు వెల్లడైంది. అమెరికా నిఘా, భద్రతా విభాగాల్లో పనిచేసే వారి నివాసాల వద్ద నిఘా వేయడం, వారికి ఖరీదైన కానుకలు ఇచ్చి వారిని తమ బుట్టలో వేసుకునేందుకు వీరు యత్నించినట్టు అమెరికా అధికారుల విచారణలో తేలింది. అరెస్టయిన ఆ ఇద్దరిలో ఒకరి వద్ద ఉన్న పాకిస్థాన్, ఇరాన్ వీసాలను స్వాధీనం చేసుకున్నారు.
తాహిర్ జాదే, హైదర్ అలీ గత కొన్ని నెలలుగా అమెరికాలో నకిలీ సర్టిఫికెట్లతో ఫెడరల్ ఏజెంట్లుగా చలామణీ అయినట్టు ఎఫ్ బీఐ గుర్తించింది. వీరిద్దరితో సన్నిహితంగా మెలిగిన అమెరికా సిబ్బందిని సెలవుపై పంపారు.