విద్యుత్ కోత‌ల‌తో ప్ర‌జ‌లు అల్లాడుతున్నారు.. జ‌గ‌న్ దిగిపోవాలి.. బీజేపీ రావాలి: సోము వీర్రాజు

08-04-2022 Fri 12:46 | Andhra
  • ఏపీలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లకు ఇబ్బందులు
  • కేంద్రం ఇచ్చిన నిధుల‌తోనే వైసీపీ జ‌గ‌న‌న్న కాల‌నీలు నిర్మిస్తోంది
  • చెల్లింపుల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం జాప్యం చేస్తోంద‌న్న వీర్రాజు 
'కావాలి జ‌గ‌న్.. రావాలి జ‌గ‌న్.. మ‌న జ‌గ‌న్..' అంటూ గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు వైసీపీ వాడిన నినాదాన్ని గుర్తు చేస్తూ బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు ఏపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. 'రాష్ట్రం బాగుండాలంటే సీఎం ప‌ద‌వి నుంచి జ‌గ‌న్ దిగిపోవాలి.. బీజేపీ రావాలి' అని ఆయ‌న అన్నారు. 

విద్యుత్ కోత‌ల‌తో ఏపీలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు అల్లాడుతున్నార‌ని సోము వీర్రాజు తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన నిధుల‌తోనే వైసీపీ జ‌గ‌న‌న్న కాల‌నీలు నిర్మిస్తోంద‌ని చెప్పారు. కేంద్ర స‌ర్కారు నిధులు ఇచ్చిన‌ప్ప‌టికీ చెల్లింపుల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం జాప్యం చేస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు. 

                          
ఇదే అంశంపై సోము వీర్రాజు ట్విట్ట‌ర్‌లో స్పందించారు. 'జగనన్న ఇల్లు అంటూ వైసీపీ చేస్తోన్న‌ ప్రచారం-ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి వాస్త‌వాలు ఇవి' అంటూ ఆయ‌న ప‌లు విష‌యాలు తెలిపారు. 'పార్వతీపురంలో నిర్మిస్తున్న గృహాల సముదాయాన్ని పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించాము. కేంద్రం 12 వేల కోట్ల రూపాయలు ఇచ్చినా కనీసం మౌలిక సదుపాయాల కల్పనలో కూడా విఫలమైన ఈ రాష్ట్ర పాలకులను అసమర్థ ప్రభుత్వం కాక ఇంకేమనాలి? ప్రభుత్వం ఇచ్చే నిధులకు వైసీపీ రంగులు  పులుముకోవడం తప్ప చిత్తశుద్ధితో చేసే అభివృద్ధి పని ఒక్కటి కూడా రాష్ట్రంలో కనిపించడం లేదు' అని సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. 
Somu VeerrajuBJPYSRCP

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more