RRR: తారక్ పై డామినేషన్ అంటూ కామెంట్లు.. స్పందించిన రామ్ చరణ్

Charan Reacts To Domination On Tarak Comments
షార్ట్స్‌లో చూడండి
బాక్సాఫీస్ వద్ద ‘ఆర్ఆర్ఆర్’ ప్రభంజనం ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే. ఎన్టీఆర్, చరణ్ లు నటనలో మరో రేంజ్ చూపించారు. అయితే, ఇద్దరిలో ఎవరు బాగా చేశారన్న దానిపై అభిమానులు ఎవరికివారు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నారు. కొందరు తారక్ పై చరణ్ డామినేట్ చేశాడని అంటే.. మరికొందరు మాత్రం చరణ్ పై తారక్ డామినేట్ చేశాడని అంటున్నారు. 

నిన్న జరిగిన సక్సెస్ మీట్ లోనూ చరణ్ వద్ద ఓ జర్నలిస్ట్ ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. తారక్ కన్నా చరణ్ ఎక్కువ మార్కులు కొట్టేశాడని అన్నారు. వెంటనే అందుకున్న చరణ్.. ఆ జర్నలిస్ట్ ను వారించాడు. 

‘‘అసలు డామినేషన్ అనే మాటను నేను నమ్మను. అందులో నిజం లేదు. ఇద్దరం చాలా బాగా చేశాం. తారక్ నటన చాలా అద్భుతంగా ఉంది. అతడితో నా ప్రయాణం సూపర్ గా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన రాజమౌళికి కృతజ్ఞతలు. నా కెరీర్ లో ఈ సినిమాను ఆస్వాదించినంతగా ఏ సినిమానూ ఆస్వాదించలేదు’’ అని అన్నాడు. 

ఇప్పుడీ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అయితే, ఆర్ఆర్ఆర్ సినిమా ఊపులోనే దానికి సీక్వెల్ పైనా ఇప్పుడే జోరుగా ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో సీక్వెల్ లోనూ ఇద్దరూ కలిసి నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Go Back to Shorts
RRR
Ramcharan
Junior NTR
Tollywood
Bollywood
Rajamouli

More Telugu News