పాకిస్థాన్ ను విడిచి పారిపోతున్న ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సన్నిహితులు!
- ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానం
- కొట్టివేసిన డిప్యూటీ స్పీకర్
- అసెంబీ రద్దుకు ఇమ్రాన్ సిఫారసు
- ఆమోదం తెలిపిన దేశాధ్యక్షుడు
- పదవి నుంచి తప్పుకున్న ఇమ్రాన్
ఇమ్రాన్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని ఫరా ఖాన్ అధికార వర్గాల్లో చక్రం తిప్పారని, అధికారుల పనులు చేసిపెట్టేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని మీడియా ఆరోపించింది. ఫరా ఖాన్ 32 మిలియన్ డాలర్ల కుంభకోణానికి పాల్పడ్డారని పాక్ విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. నాడు ఇమ్రాన్ అండతో చెలరేగిన ఫరా ఖాన్ వంటి సన్నిహితులు ఇప్పుడు ఇమ్రాన్ అధికారంలోకి లేకపోయేసరికి అరెస్టులకు భయపడి దేశాన్ని విడిచి పారిపోతున్నారని మీడియా పేర్కొంది.