RRR: 'ఆర్ఆర్ఆర్' టీమ్ కు దిల్ రాజు ఇచ్చిన పార్టీలో సందడి మామూలుగా లేదు.. వీడియో ఇదిగో!

Fantastic visual from last night RRR party hosted by Dil Raju
షార్ట్స్‌లో చూడండి
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన విజువల్ వండర్ 'ఆర్ఆర్ఆర్' మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. బాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టేసి భారీ కలెక్షన్లను వసూలు చేస్తోంది. మరోవైపు ఈ సినిమా నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీసుకున్నారు. నైజాంలో ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టడంతో... 'ఆర్ఆర్ఆర్' టీమ్ కు ఆయన సక్సెస్ పార్టీ ఇచ్చారు. 

హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో ఈ పార్టీ జరిగింది. ఈ పార్టీకి తారక్, చరణ్, రాజమౌళి, మరో దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు 'ఆర్ఆర్ఆర్' టీమ్ సభ్యులు, ఇతర టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. పార్టీలో రాజమౌళి, అనిల్ రావిపూడి 'నాటు నాటు' పాటకు స్టెప్పులు వేసి అలరించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Go Back to Shorts
RRR
Success Party
Junior NTR
Ramcharan
Rajamouli
Anil Ravipudi
Natu Natu

More Telugu News