Dil Raju: 'ఆర్ఆర్ఆర్' టీమ్ కోసం గ్రాండ్ గా పార్టీ ఇస్తున్న దిల్ రాజు

Dil Raju arranges grand party for RRR team
షార్ట్స్‌లో చూడండి
తెలుగు సినిమా పరిధి టాలీవుడ్ ను దాటి ఎప్పుడో పాన్ ఇండియా స్థాయికి విస్తరించింది. బాహుబలి చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తం చేసిన రాజమౌళి... తాజాగా 'ఆర్ఆర్ఆర్' తో దాన్ని మరో మెట్టు ఎక్కించాడు. కలెక్షన్ల పరంగానూ ఈ చిత్రం దూసుకుపోతోంది. ఇప్పటికే రూ.750 కోట్ల గ్రాస్ సాధించిన 'ఆర్ఆర్ఆర్'... రూ.1000 కోట్ల దిశగా పయనిస్తోంది. 'ఆర్ఆర్ఆర్' తిరుగులేని విజయంతో చిత్రబృందం ఆనందోత్సాహాల్లో మునిగితేలుతోంది. 

ఈ నేపథ్యంలో, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 'ఆర్ఆర్ఆర్' టీమ్ కు హైదరాబాద్ లో గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ విందుకు 'ఆర్ఆర్ఆర్' యూనిట్ సభ్యులందరూ వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పార్టీకి రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ సతీసమేతంగా వచ్చినట్టు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు సందడి చేస్తున్నాయి. సంగీత దర్శకుడు కీరవాణి కూడా విచ్చేశారు.
Go Back to Shorts
Dil Raju
RRR
Unit Members
Grand Party
Hyderabad
Tollywood

More Telugu News