జనసేన క్రియాశీలక కార్యకర్తల బీమా ప్రీమియంను చెల్లించిన పవన్ కల్యాణ్
Add ap7am to your home Screen

జనసేన క్రియాశీలక కార్యకర్తల బీమా ప్రీమియంను చెల్లించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan pays Janasena active members insurance annual premium
  • జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు బీమా సౌకర్యం
  • రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా
  • పవన్ ను కలిసిన బీమా సంస్థ ఉన్నతాధికారులు
  • ఏప్రిల్ 1 నుంచి బీమా అమలు
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు బీమా సౌకర్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా, ప్రమాదం జరిగినప్పుడు వైద్య ఖర్చులకు రూ.50 వేల వరకు బీమా సదుపాయం అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో, 2022-23 సంవత్సర కాలానికి గాను జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల బీమా ప్రీమియంను పవన్ కల్యాణ్ చెల్లించారు. ఇవాళ తనను కలిసిన బీమా సంస్థ ఉన్నతాధికారులకు ఈ మేరకు చెక్ అందజేశారు. 

ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్ సంస్థ డీజీఎం, జనసేన పార్టీ బీమా పాలసీ సలహాదారు యడ్ల వెంకటనరసింహారావు, పార్టీ ట్రెజరర్ ఏవీ రత్నం పాల్గొన్నారు. కాగా, ఈ బీమా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానుంది.
Pawan Kalyan
Janasena
Active Members
Insurance
Premium

More Telugu News