ఉగాదికి 'సర్కారువారి పాట' మూడో సింగిల్!
- ప్యాచ్ వర్క్ లో 'సర్కారువారి పాట'
- సంగీత దర్శకుడిగా తమన్
- థర్డ్ సింగిల్ రిలీజ్ కి సన్నాహాలు
- మే 12వ తేదీన సినిమా విడుదల
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి ఇటీవల సెకండ్ సింగిల్ గా 'పెన్నీ' సాంగ్ వదిలారు. మహేశ్ కూతురు సితార కూడా మెరిసిన ఈ సాంగ్ కూడా ఒక రేంజ్ లో దూకుడు చూపుతూ వెళుతోంది. ఇక ఇప్పుడు 'ఉగాది' కానుకగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ రానుందనేది ఆసక్తికరంగా మారింది.
'ఉగాది' రోజున ఈ సినిమా నుంచి మూడో సింగిల్ ను వదలనున్నారనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. మరి మూడో సాంగ్ రిలీజ్ చేస్తారా? ట్రైలర్ వదులుతారా? అనేది చూడాలి. మే 12వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. కీర్తి సురేశ్ కథానాయికగా సందడి చేయనుండగా, సముద్రఖని .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.