ఎల్లుండి 'ఆర్ఆర్ఆర్' విడుదల.. అప్పుడే థియేటర్ల వద్ద నానా హంగామా.. వీడియోలు ఇవిగో
- థియేటర్ల వద్ద భారీ కటౌట్లు
- పలు ప్రాంతాల్లో పండుగ వాతావరణం
- సినిమా కలెక్షన్లపైనే అందరి దృష్టి
భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ ఈ సినిమాకు సంబంధించి భారీ కటౌట్లు కనపడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా విడుదల వేడుకను అభిమానులు పండుగలా జరుపుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజమౌళి, తారక్, చెర్రీ బిజీగా ఉంటున్నారు. ఈ సినిమాలో చెర్రీ అల్లూరిగా, తారక్ కొమురం భీమ్‌గా నటించారు.
బాహుబలి తర్వాత రాజమౌళి రూపొందించిన ఈ సినిమా కలెక్షన్లపైనే ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది.